మీ Dilemma ఒక భ్రమ: The Brutal Truth Behind Right and Wrong

ఒక వ్యక్తి తన వీపుపై 'పాపం - పుణ్యం' అని రాసి ఉన్న భారీ రాయిని మోస్తూ ఒక సన్నని పసుపు రంగు దారిలో వెళ్తున్న క్లేమేషన్ చిత్రం.

సందిగ్ధత: కురుక్షేత్రం నుండి నేటి వరకు మిగిలిన ఒకే ఒక భ్రమ

ఈ వారం మనం విశ్లేషించబోయేది.. ఒక అపార్థం చేసుకోబడిన తత్వం.

మనుషులందరినీ పట్టి పీడిస్తున్న అతిపెద్ద జబ్బు గురించి.

"సందిగ్ధత (Dilemma) - ఏది తప్పు, ఏది ఒప్పు?" ఇంటర్నెట్ లో, ముఖ్యంగా so called "Think" చేసే Podcasts లో, సమాజం గురించీ, సైకాలజీ గురించీ పైపైన మాట్లాడుతూ, బురదలో కూరుకుపోయిన వాడికి perfume కొట్టే ప్రయత్నం చాలా జరుగుతోంది. కానీ ఈ రోజు మనం ఆ ముసుగులన్నీ పీకేద్దాం. నిజాన్ని అత్యంత నగ్నంగా, పచ్చిగా కళ్ల ముందు పెడతాను.

ధర్మసంకటం అనే ముసుగు: కృష్ణుడు బద్దలు కొట్టిన అహంకారం

ఈ "సందిగ్ధత" అనే రోగం ఈనాటిది కాదు. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో మహావీరుడు అనుకున్న అర్జునుడికి కూడా ఇదే దురద పుట్టింది. "నా వాళ్ళను నేను ఎలా చంపుకోవాలి? ఏది ధర్మం, ఏది అధర్మం?" అని ఏడుస్తూ ఆయుధాలు కింద పడేశాడు. దాన్ని జనాలు చాలా గొప్పగా "ధర్మసంకటం" అని కీర్తిస్తారు.

కానీ అక్కడ కృష్ణుడు అర్జునుడి భుజం మీద చెయ్యేసి ఓదార్చలేదు. కృష్ణుడు పచ్చి నిజాన్ని మొహం మీద కొట్టాడు. అర్జునుడికి ఉన్నది ధర్మసంకటం కాదు, కేవలం తనవాళ్లు అనే ఒక పనికిమాలిన అటాచ్మెంట్ (Attachment) మరియు భయం అని తేల్చి చెప్పాడు. "చంపేది నువ్వు కాదు, చచ్చేది వాళ్ళు కాదు, నువ్వు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి (Instrument)" అని అహంకారాన్ని బద్దలు కొట్టాడు.

సరిగ్గా ఈనాటికీ అదే జరుగుతోంది. "నా జీవితంలో ఒక సందిగ్ధత వచ్చింది, నేనేం చేయాలి? ఏది పాపం, ఏది పుణ్యం? ఏది ధర్మం, ఏది అధర్మం?" — ఇవి సాధారణంగా ప్రతి మనిషినీ అయోమయానికి గురి చేస్తున్న ప్రశ్నలు. నిజం చెప్పాలంటే, మీకు సందిగ్ధత లేదు, మీకు ఉన్నదల్లా భయం మరియు మూర్ఖత్వం.

సమాజం కుక్కిన ప్రోగ్రామింగ్ (Social Programming)

ఒక వైపు సమాజం నేర్పించిన అబద్ధాలు, ఇంకోవైపు మీ లోపల ఉన్న స్వార్థం. ఈ రెండింటి మధ్య నలిగిపోవడాన్నే మీరు చాలా స్టైల్ గా "Dilemma" అని పిలుచుకుంటారు. మీకు తప్పు, ఒప్పుల నిర్వచనాలు ఎప్పుడూ భ్రమనిస్తాయి, ఎందుకంటే ఆ నిర్వచనాలన్నీ మీరు అరువు తెచ్చుకున్నవి. మీ తల్లిదండ్రులు, మీ గురువులు, ఈ కుళ్ళిపోయిన సమాజం మీ బుర్రలో కుక్కిన programming అది.

ఉదాహరణకు చూడండి, ప్రపంచం ఎంత కపటంగా ఉందో! చిన్నప్పటి నుండి ప్రతి తల్లీదండ్రీ తమ పిల్లాడికి "అబద్ధం ఆడకు, అహింసను పాటించు, పక్కవాడికి హాని చేయకు" అనే నూరిపోస్తారు. మరి ఈ ప్రపంచంలో ఎటు చూసినా కపటం, హింస, వ్యభిచారం, యుద్ధాలు ఎందుకు కనబడుతున్నాయి? ఈ అణు బాంబులు తయారు చేస్తున్నది, వాటిని ప్రయోగిస్తున్నది కూడా, ఎవరికో ఒకప్పుడు చిన్న పిల్లలుగా పుట్టి, ఇప్పుడు పెద్దయిన ఆ చిన్న పిల్లలే కదా! వాళ్ళ అమ్మానాన్నలు కూడా వాళ్ళకు "హింస తప్పు" అనే నేర్పించి ఉంటారు కదా! మరి ఈ ప్రపంచం వినాశనం అంచున ఎందుకు నిలబడి ఉంది?

చరిత్రను ఒక్కసారి చూడండి. జూలియస్ రాబర్ట్ ఓపెన్‌హైమర్ (J. Robert Oppenheimer) అణుబాంబును సృష్టించి లక్షలాది మంది ప్రాణాలు గాల్లో కలవడానికి కారణమయ్యాడు. ఆ ప్రయోగం జరిగినప్పుడు అతను ఏమన్నాడో తెలుసా? భగవద్గీతలోని శ్లోకాన్నే కోట్ చేశాడు: "Now I Become  The Death, The Destroyer of Worlds." చూశారా కపటం? అత్యంత దారుణమైన విధ్వంసాన్ని సృష్టించి, మళ్లీ దానికి ఒక Mythological ముసుగు వేయడం. ఎందుకంటే, మనం నేర్చుకున్నది, మనం చెబుతున్నది, అంతా ఉట్టి చెత్త. మనకు అసలు విషయం ఏంటో తెలియదు, కానీ మనకు అన్నీ తెలుసు అనే ఒక పనికిమాలిన అహంకారం మాత్రం ఉంది.

సృష్టిలో ఉన్న ఏకైక కొలబద్ద: అంతర్గత శాంతి

ఈ "తప్పు-ఒప్పుల" dilemma నుండి బయటపడాలంటే ఏకైక మార్గం: హోష్ లోకి రావడం. స్పృహలోకి రండి, ఆ స్పృహను జారిపోనివ్వకండి. నీటిలా మారిపోండి. ఒక కొండపై నుండి నీటి ధారను కిందకు వదిలి చూడండి. ఆ కొండ ఎగుడుదిగుడుగా ఉంటుంది, రాళ్లు ఉంటాయి, గొయ్యిలుంటాయి. కానీ ఆ నీటి ధార ఎక్కడైనా ఆగిపోయి ఇలా ఆలోచిస్తుందా? "అయ్యో, ఏ మార్గం నాకు సరైనది? ఇటు వెళ్లడం పాపమా? అటు వెళ్లడం పుణ్యమా? సమాజం ఏమనుకుంటుంది?" అని ఆ నీరు ఒక Podcast వింటూ కూర్చుంటుందా?

లేదు! ఆ నీటికి ఎటు వెళ్లాలో తెలుసు. ఆ నీరు తన గమ్యాన్ని చేరుకోవడానికి సంపూర్ణంగా Surrender అయి ఉంది. కింద ఎక్కడో ఒక చెరువు లేదా సముద్రం ఉంటుంది. అక్కడికి చేరుకునే వరకు అది ఆగదు. ఒక్కసారి ఆ సముద్రంలో కలిశాక, ఇక ఆ నీటికి ఏ కదలికా అవసరం లేదు. అది శాంతిస్తుంది. అలాగే, మీరు ఎప్పుడైతే సత్యానికి, అంతర్గత శాంతికి (Inner Peace) మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో, దారి దానంతట అదే ఏర్పడుతుంది. మీకు ఏ "Self-help" పుస్తకాలూ అవసరం లేదు, మీరు బుర్ర బద్దలు కొట్టుకోనవసరం లేదు.

అష్టావక్రుడి కఠోర సత్యం: ద్వంద్వాల దహనం

అష్టావక్ర మహాముని (Ashtavakra) జనక మహారాజుకు బోధించిన అత్యంత కఠోరమైన సత్యం ఇదే. "నీకు శాంతి కావాలంటే, నువ్వు తప్పు-ఒప్పుల ద్వంద్వాన్ని (Duality) తగలబెట్టాలి. నువ్వు కేవలం సాక్షివి (Observer) మాత్రమే." సమాజం చెప్పే కొలబద్దలను తగలబెట్టండి. మీకు నేను ఒకే ఒక కచ్చితమైన కొలబద్ద ఇస్తాను, రాసుకోండి:

మిమ్మల్ని మీ ఆఖరి గమ్యం వైపు తీసుకువెళ్లే ప్రతి పనీ పుణ్యమే, అదే సరైనది. మిమ్మల్ని మీ ఆఖరి గమ్యం నుండి దూరం చేసే ప్రతి పనీ పాపమే, అదే తప్పు.

ఇంతకీ ఆ ఆఖరి గమ్యం ఏమిటి? మీకు ప్రశాంతత కావాలి, మీరు మౌనంగా మారాలి, మీరు లోపల ఎంత సంపూర్ణంగా నిండిపోవాలంటే, ఇక ఈ ప్రపంచాన్ని అడుక్కోవాల్సిన అవసరం రాకూడదు. మీరు స్థిరపడిపోవాలి, సంపూర్ణ విశ్రాంతిలోకి వెళ్ళాలి. అదే మీ ఆఖరి గమ్యం. ఏ పనైతే మిమ్మల్ని ఆ నిశ్శబ్దం వైపు తీసుకెళ్తుందో, కళ్ళు మూసుకుని ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోండి.

వాళ్ళు మీకు వంద చెప్తారు: "ఇది తప్పు, అది తప్పు" అని. 

మీరు వేసే ప్రతి అడుగూ, మీరు చేసే ప్రతి పనీ, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, ఈ ఒక్క ప్రశ్న మీదే ఆధారపడి ఉండాలి: "నేను చేసే ఈ పని నన్ను శాంతి వైపు తీసుకువెళ్తోందా? లేదా నా జీవితాన్ని మరింత అల్లకల్లోలం చేస్తోందా?"

శాంతి వైపు తీసుకువెళ్తే, ఆ దారిలో నడవండి. మధ్యలో ఆ దారి వంకరలు తిరిగినా పర్వాలేదు. గమ్యం మీ మనసులో స్థిరంగా ఉంటే, ప్రయాణం దానంతట అదే పూర్తవుతుంది. దాన్ని మరిచిపోయారా, మీరు ప్రతీ చిన్న దానికి ఏడుస్తారు: "అబ్బా నా వల్ల కావట్లేదు, నేను ఒక్కడినే అన్నీ చేసుకోవాలి, ఎంత కష్టపడాలి?" అని. ఇలా మీరు ఏడుస్తున్నారు అంటే, కారణం ఒక్కటే: మీ మనసు కోతి లాంటిది, అది గమ్యాన్ని వదిలేసి పనికిమాలిన పది వేర్వేరు విషయాలను పట్టుకుని వేలాడుతోంది. ఒక కళ్లజోడు పెట్టుకోండి. ఆ కళ్లజోడులోంచి చూస్తే మీకు ఈ రోత ప్రపంచం కనిపించకూడదు, కేవలం మీ గమ్యం మాత్రమే కనిపించాలి.

చాలామంది ఒక వెర్రి వాదన చేస్తారు: "ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డవాళ్ళు కాదు, ఎవరి కోణంలో వారు సరైనదే చేస్తున్నారు కదా? మరి ఎందుకు అన్నీ తప్పులు జరిగిపోతున్నాయి?"

ఇక్కడే మీ అహంకారాన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. అవును, అందరూ తమకు "తోచిన" లెక్కల ప్రకారం సరైనదే చేస్తున్నారు. కానీ మీ లెక్క ఎప్పుడూ తప్పే! మీ వ్యక్తిగత లెక్కలనేవి, చీకట్లో గుడ్డిగా బాణాలు వేయడం లాంటిది. మీకు ఎక్కడికి చేరుకోవాలో, ఆ దారి ఏదో, మీ వాహనం ఏదో కూడా తెలియదు. కానీ "నేను పది నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాను" అని గొప్పగా లెక్కలేసుకుంటారు. ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా పిచ్చి పట్టినట్టు "అలా వెళ్ళు, ఇలా వెళ్ళు" అని పరుగెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? వెళ్తున్నది ఎవడు? ఈ కనీస స్పృహ లేకుండా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు.

Higher Intelligence తో నడవడం అంటే, ఎక్కడికి చేరుకోవాలో, దానికే మిమ్మల్ని మీరు Surrender చేయడం. "నా పనికిమాలిన బుర్రతో నేను ఏమీ చేయలేను, నువ్వే నన్ను నడిపించు" అని మీ అహంకారాన్ని చంపుకోవడం. అలాగని చేతులు కట్టుకుని కూర్చోమని కాదు. మీరు విపరీతంగా శ్రమిస్తారు. కానీ ఆ శ్రమ మీ వ్యక్తిగత స్వార్థ బుద్ధి నుండి రాదు, అది సమష్టి Universal consciousness నుండి వస్తుంది. అప్పుడు మీ ఆలోచనలు ఆ విశ్వానివి (Highest Truth) అయిపోతాయి. ఒక రైలు పట్టాల్లాగా, ఒక పట్టా ఎటు వెళ్తే రెండోది కచ్చితంగా అటే వెళ్తుంది. ఆ సమాంతరత వచ్చినప్పుడు మాత్రమే, మీ లెక్కలు ఎప్పుడూ తప్పవు.

మరణం విముక్తి కాదు, అదొక యాంత్రిక ప్రక్రియ

చాలామంది మూర్ఖులు అనుకునేది ఏంటంటే, ఒకసారి చచ్చిపోతే ఈ కష్టాలన్నీ తీరిపోతాయి, మరణమే అంతిమ విముక్తి అని. చచ్చిపోవడం వల్ల ఎవరికీ విముక్తి రాదు. పుట్టడం ఎంత యాంత్రికమో, చావడం కూడా అంతే యాంత్రికం. ఒక కథ మొదలైంది, ఆ కథ ముగిసింది... అంతే. దానికి, ముక్తికి (Liberation) ఎలాంటి సంబంధం లేదు.

మీరు మీ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఆకాశంలో ఒక విమానం ఎగురుతుండడం చూసారు. అది ఎక్కడో దూరంగా ఉన్న వేరే నగరంలో takeoff  అయ్యింది.. ఇప్పుడు మీ ఇంటి పైనుండి ఎగురుతూ వెళ్తోంది.. కాసేపటికి  ఎక్కడో దూరంగా ఉన్న ఇంకో నగరంలో Land ఔతుంది. ఆ Takeoff అవ్వడం మీ ఇల్లు కాదు, అది ఎగరడం మీ ఇల్లు కాదు, ల్యాండ్ అవ్వడం కూడా మీ ఇల్లు కాదు. అవన్నీ బయట జరుగుతున్న ప్రక్రియలు. అలాగే, జననం (Takeoff), జీవితం (Flight), మరణం (Landing).. ఇవన్నీ బయట జరుగుతున్న యాంత్రిక ప్రక్రియలు. ఇక ముక్తి అనేది ఈ Circus మొత్తాన్ని కళ్లారా చూసి, అర్థం చేసుకుని, దీని పట్ల ఉన్న ఆశను, భ్రమను వదిలేయడంలో ఉంది.

మరణం తర్వాత కూడా ఈ 'నేను' అనే అహంకారం ఎలా మిగిలి ఉంటుంది అని అడుగుతుంటారు కొందరు. సముద్రంలో ఎన్నో అలలు పుడతాయి. ఒక అలకు "Surya" అని పేరు పెడదాం. ఆ అల కాసేపటికి ఒడ్డుకు వచ్చి పగిలిపోయి, అంతరించిపోతుంది. Surya అనే అల చచ్చిపోయింది, కానీ ఆ సముద్రంలో "అలలు వచ్చే తత్వం" (Tendency to wave) చచ్చిపోయిందా? లేదు. Surya పోతే ఇంకొకడు వస్తాడు.

భవచక్రం: The Wheel of Samsara

బౌద్ధ తత్వం (Buddhist Philosophy) లో దీన్నే 'భవచక్రం' (Wheel of Samsara) అంటారు. మీరు కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మీరు ఒక పెద్ద ఫ్యాక్టరీలో వరుసగా తయారై బయటకు వస్తున్న Packaged products లాంటి వాళ్ళు. ఒక్కో ప్రొడక్ట్ కు ఒక్కో పేరు, చిన్న చిన్న తేడాలు Aesthetics, style, packaging లో ఉండొచ్చు, కానీ బేసిక్ మెటీరియల్ అంతా ఒకటే. మీరు చచ్చిపోతారు, మీ వెనక ఇంకొకడు వస్తాడు. ఫ్యాక్టరీ ఉత్పత్తి చేయడం మాత్రం ఆపదు. మీ దేహం అనే డబ్బా నాశనం అయిపోవచ్చు, కానీ ఆ "నేను (I)" అనే తత్వం, ప్రవృత్తి మాత్రం ఆ ఫ్యాక్టరీలో ఎప్పటికీ మిగిలే ఉంటుంది. అది మళ్లీ మళ్లీ కొత్త డబ్బాలను తయారు చేస్తూనే ఉంటుంది.

సంపూర్ణ మరణం ఎక్కడ ఉంది? చావుతోనే అంతా అయిపోతుంది అనుకుంటే ఎలా? మీ అజ్ఞానానికి, మీ కండిషనింగ్ కి హద్దులు లేవు. ఈ సమాజం, ఈ social media, మీరు చూసే Internet చెత్తాచెదారం అంతా మీ అహంకారాన్ని పెంచి పోషించేవే. మీకు సత్యం కావాలంటే, మీ Comfort zone ని బద్దలు కొట్టాలి. పచ్చి నిజాన్ని జీర్ణించుకునే దమ్ము ఉండాలి.

పనికొచ్చే ఆలోచనలు చేయండి. అరువు తెచ్చుకున్న "తప్పు-ఒప్పుల" కొలబద్దలను తీసి చెత్తబుట్టలో వేయండి. సత్యానికి పూర్తి స్థాయిలో Surrender అవ్వండి. ఒక గరుకైన, మొరటైన వాస్తవంలో బతకడం నేర్చుకోండి. చరిత్రలో బుద్ధుడు, అష్టావక్రుడు లాంటి వారు ఈ వాస్తవాన్ని అంగీకరించారు కాబట్టే ఆ ఫ్యాక్టరీ సైకిల్ నుండి బయటపడ్డారు.

ఈ Blog మీకొక మేల్కొలుపు, Wake up call. ఆలోచించండి. లేదంటే ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఇంకో లేబుల్ లేని డబ్బాలాగా పుట్టి, గిట్టిపోతారు. ఎవరికీ మీ అవసరం లేదు, ప్రకృతికి మీ పట్టింపు అసలే లేదు.

-PRATIKULA VEDAM

Comments

Popular posts from this blog

మీరు బతుకుతున్నారా, లేక Normal అనే నాటకంలో గొర్రెలా నటిస్తున్నారా? పిచ్చివాళ్ల సమాజంలో Normal గా బతకడమే అతిపెద్ద పిచ్చి!

నీ జీవితంలో ఉన్నవి Problems కావు, నీ చిల్లర కోరికలు.

బానిసత్వానికి నువ్వు పెట్టుకున్న ముద్దుపేరు "బాధ్యత".