Love Failure ఒక Illusion: ప్రేమ పేరుతో మీరు చేసే Business

                                           

"మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు, తిరిగి మనల్ని ఎందుకు ద్వేషిస్తారు?"

తెలుగు నాట ప్రతి వీధిలో, ప్రతి YouTube channel లో, ప్రతి సినిమా పాటలో మార్మోగిపోయే ప్రశ్న ఇది. వినడానికి చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది కదా? కానీ ఒక ruthless, analytical కోణంలో ఈ ప్రశ్నను ముక్కలు ముక్కలుగా కోసి చూస్తే, ఇందులో ఉన్న కపటత్వం, Hypocrisy బయటపడుతుంది.

అసలు మీ బాధ దేని గురించి? మీరు ఒకరిని ప్రేమించారు. ప్రేమ అనేది మీ మనసులోని ఒక భావన, మీ అంతర్గత ప్రక్రియ. మీరు చేయాలనుకున్న పని మీరు చేసేశారు. మరి ఇక సమస్య ఏంటి? "నేను ప్రేమించాను" అని గర్వంగా ఫీలవ్వాలి కదా? కానీ మీరు ఏడుస్తున్నారు, "వాళ్ళు నన్ను తిరిగి ప్రేమించలేదు" అని.

అంటే, ఇక్కడ దొరికిపోయారు!

మీకు కేవలం "ప్రేమించడం" మాత్రమే ముఖ్యం కాదు. ఆ ప్రేమ ముసుగులో మీరు ఏదో ఆశించారు. Expectation! అవతలి వ్యక్తి నుంచి మీకు ఒక REPLY కావాలి, వాళ్ళ సమయం కావాలి, వాళ్ళ ATTENTION కావాలి, సమాజంలో ఒక గుర్తింపు కావాలి, అంతిమంగా వాళ్ళ దేహం కావాలి. ఇవన్నీ ఆశించి, దానికి "ప్రేమ" అనే ఒక పవిత్రమైన Label అంటించారు. ఆశించింది దక్కకపోయేసరికి "ప్రేమకు ద్వేషం ఎదురైంది" అని నాటకాలు ఆడుతున్నారు.

ప్రేమించడం మాత్రమే మీ లక్ష్యం అయితే, మిమ్మల్ని ఎవరు ఆపగలరు?

మిమ్మల్ని ఒక చీకటి గదిలో బంధించి, సంకెళ్లు వేసినా సరే, మీ లోపల ఉన్న ప్రేమను ఎవరూ బంధించలేరు కదా? చేతులకు బేడీలు వేయగలరు కానీ, మీ భావాలకు వేయలేరు. మరి మీ ప్రేమ Fail అవ్వడం ఏంటి?

ఎవరైనా వచ్చి, "నా ప్రేమ విఫలం అయిపోయింది బ్రో" అని చెబితే, అది పచ్చి అబద్ధం అని అర్థం చేసుకోండి. వాళ్ళని నిలదీసి అడగండి: "అరె! తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది" అని మీరు ఏడుస్తుంటే, మీరు ప్రేమించినట్లా? లేక మీ అహంకారం దెబ్బతిన్నట్లా? "నాకు దక్కాల్సిన వస్తువు ఇంకొకడి పాలైంది" అనే కడుపుమంట తప్ప, అందులో ప్రేమ ఎక్కడుంది?

మీకు కావాల్సింది ప్రేమ కాదు, Ownership. ఒక మనిషిని మీ ఆస్తిగా రాసిచ్చేయాలి. వాళ్ళ స్వేచ్ఛను హరించి, మీ కాళ్ళ దగ్గర పడేయాలి. దానికి మీరు పెట్టిన ముద్దుపేరు "Love". మీకు నిజంగా కావాల్సింది ఆ మనిషి దేహం, వాళ్ళ ద్వారా మీకు దక్కే సుఖం. అది దక్కలేదు కాబట్టి "నా ప్రేమ ఓడిపోయింది" అని కన్నీరు కారుస్తున్నారు. ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు, ఓడిపోయేది కేవలం మీ స్వార్థం మాత్రమే.

"మరి వాళ్ళు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు?"

ఒక అద్భుతమైన నిజాన్ని జీర్ణించుకోండి. అవతలి వ్యక్తి మూర్ఖులు కాదు. వాళ్ళకు తెలుసు, మీరు వాళ్ళపై కురిపిస్తున్నది నిస్వార్థమైన ప్రేమ కాదని. మీ ప్రేమ వెనుక ఒక భయంకరమైన ఉచ్చు (Trap) ఉందని వాళ్ళ 
Subconscious mind కి ఎప్పుడో అర్థమైపోయింది.

మీరు ఇచ్చే ప్రతి కానుక వెనుక, మీరు చేసే ప్రతి మెసేజ్ వెనుక ఒక అదృశ్యమైన Expectation దాగి ఉంది. మీరు వాళ్ళను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ, వాళ్ళ స్వేచ్ఛను గుంజుకోవాలని చూస్తున్నారు. మీ మానసిక శూన్యతను (Inner Emptiness) పూరించుకోవడానికి వాళ్ళను ఒక టూల్ (Tool) లా వాడుకోవాలని చూస్తున్నారు.

ఆ అవతలి వ్యక్తి మీ కపటత్వాన్ని పసిగట్టారు కాబట్టే, మీ "ప్రేమ" వాళ్ళకు ఉక్కిరిబిక్కిరి చేసే ఒక జైలు లాగా అనిపించింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటున్నారు. వాళ్ళ ద్వేషం మీ ప్రేమ మీద కాదు, మీ ప్రేమ ముసుగులో ఉన్న మీ "వ్యాపార బుద్ధి" మీద.

మన సమాజం మన బ్రెయిన్ ని ఎలా ప్రోగ్రామ్ చేసిందంటే, ప్రేమను ఒక కిరాణా కొట్టు వ్యాపారంలా మార్చేసింది.

"నేను నీకు రోజూ ఉదయాన్నే Good Morning message పెడుతున్నాను అంటే, అది
 100 గ్రాముల ప్రేమ."

"నీ బర్త్ డే కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాను అంటే,
అది 1 కిలో ప్రేమ."

"మరి నువ్వు నాకు తిరిగి ఏమిస్తున్నావు? కనీసం నా ఫోన్ అయినా ఎత్తాలి కదా?"

ఇది లావాదేవీ (Transaction). మీరు ప్రేమించడం లేదు,  కొలతలు వేస్తున్నారు. "నేను నీకు ఇంత ఇచ్చాను, లెక్క రాసి పెట్టుకో, వడ్డీతో సహా తిరిగి చెల్లించు" అని పరోక్షంగా బెదిరిస్తున్నారు. రోజులు గడుస్తున్నా అవతలి వైపు నుండి రాబడి (Return on Investment) రాకపోయేసరికి మీకు చిరాకు వస్తుంది.

ప్రేమ అనేది బిచ్చమెత్తుకునే ప్రక్రియ కాదు. మహోదయా, నేను మీకు నా విలువైన సమయాన్ని సమర్పించుకుంటున్నాను, దయచేసి నాకు కాస్త ప్రేమను భిక్షం వేయండి, అని application పెట్టుకోవడానికి ఇదేమైనా గవర్నమెంట్ జాబ్ ఆ? అడగడం, యాచించడం మొదలుపెట్టారంటే, అక్కడ ప్రేమ చచ్చిపోయి, బానిసత్వం (Slavery) మొదలైనట్లే.

నిజమైన ప్రేమకు లెక్కలు ఉండవు, షరతులు ఉండవు. అది ఒక Absolute Freedom. దాన్ని ఎవరూ ఆపలేరు. మీలో నిజంగా ప్రేమ ఉంటే, అవతలి వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నా సరే, మీరు నవ్వుతూ ఇలా చెప్పగలగాలి:


"నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా? సంతోషం. అది నీ Personal issue. నీ మనసులో నువ్వు ఏం కిచిడీ వండుకుంటున్నావో అది నీ ఇష్టం. నీకు నన్ను ద్వేషించే హక్కు వంద శాతం ఉంది. కానీ, నేను నిన్ను ప్రేమించడాన్ని నువ్వు ఆపలేవు. నా ప్రేమ నా అంతర్గత స్వేచ్ఛ. నా ఆనందం నీ reply మీద ఆధారపడి లేదు."

అది అసలైన స్వాతంత్ర్యం.

మీకు ప్రేమించే సత్తా ఉంటే, Darwin సిద్ధాంతంలాగా survial కోసం ఎదురుచూడకండి.

చక్రవర్తిలాగా ఇవ్వండి. మీ దగ్గర ప్రేమ అనే సంపద ఉంది, దాన్ని పంచుతున్నారు. వాళ్ళ దగ్గర ద్వేషం అనే దారిద్ర్యం ఉంది, వాళ్ళు దాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు మీ స్వభావానికి బద్ధులు, వాళ్ళు వాళ్ళ మానసిక స్థితికి బద్ధులు.

ఇకనైనా ఏడవడం మానేయండి. మీ లోపల ఉన్న ఖాళీతనాన్ని (Emptiness) పూరించుకోవడానికి ఇంకొకరిని వాడుకునే Parasite లాగా బతకకండి. "వాళ్ళు ప్రేమించలేదు, కాబట్టి నా జీవితం నాశనం అయింది" అని సానుభూతి కోరుకునే Victim Card ప్లే చేయడం ఆపండి. ప్రేమ అంటే ఇవ్వడం. తీసుకునేది, లాక్కునేది, demand చేసేది ఎప్పటికీ వ్యాపారమే అవుతుంది.

సమాజం నేర్పిన ఈ "Romantic Conditioning" ను బద్దలు కొట్టండి. Reality ని ఫేస్ చేయండి. ప్రేమించండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాదు. స్వతంత్రంగా 
ప్రేమించండి.

-PRATIKULA VEDAM

Comments

Popular posts from this blog

మీరు బతుకుతున్నారా, లేక Normal అనే నాటకంలో గొర్రెలా నటిస్తున్నారా? పిచ్చివాళ్ల సమాజంలో Normal గా బతకడమే అతిపెద్ద పిచ్చి!

నీ జీవితంలో ఉన్నవి Problems కావు, నీ చిల్లర కోరికలు.

అసలు SUCCESS అంటే ఏంటి?