ఎందుకంటే, ఆ వీడియోలు చేసేవాళ్ళకి వాళ్ళ వ్యూస్ ముఖ్యం, మరియు చూసే మీకు మీ "రోగం" ముఖ్యం. అవును, మీరు విన్నది నిజమే. మీకు మీ రోగం అంటే ఇష్టం. మీ lust, మీ భయాలు మీకు చాలా ఇష్టం. వాటిని వదిలించుకోవడం మీకు ఏమాత్రం ఇష్టం లేదు. కేవలం ఆ వాసనల వల్ల వచ్చే frustration and depression నుండి మాత్రమే మీకు విముక్తి కావాలి. అంటే, మందు తాగాలి, కిక్ రావాలి, కానీ liver పాడవకూడదు. ఇది మీ demand. ఎంత హాస్యాస్పదం!
ఈ రోజు మనం ఒక అత్యంత లోతైన విశ్లేషణ ఆధారంగా, మానవ మనస్తత్వపు చీకటి కోణాలను బట్టబయలు చేద్దాం. ఇది ఎవ్వరూ మాట్లాడని నిజం. ఎందుకంటే ఈ నిజం మిమ్మల్ని నగ్నంగా నిలబెడుతుంది.
ఒక విద్యార్థి నన్నిలా అడిగాడు: "నేను ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వింటున్నాను. నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి, మూఢనమ్మకాలు పోయాయి. కానీ ఒక అందమైన అమ్మాయిని చూడగానే నాలో Lust ఎందుకు పుడుతోంది? నా లోపల ఆ tendency ఎందుకు మారలేదు? నాకు frustration గా ఉంది."
ఇది మీలో చాలా మంది అడిగే ప్రశ్నే. "నాకు అంతా తెలుసు కదా, అయినా నేను ఎందుకు ఆకర్షితుడిని అవుతున్నాను?" అని.
"నీ ఇంట్లో ఒక ఆహారం చీకట్లో పెట్టుంది. అది కళ్ళిపోయింది. కానీ నీకు అదంటే చాలా ఇష్టం. బయట నుండి ఒక గురువు వచ్చి, దాని మీద టార్చ్ లైట్ వేసి, 'చూడు నాయనా, అది కుళ్ళిపోయింది, అది తింటే నువ్వు చస్తావు' అని మాత్రమే చెప్పగలడు. అంతే కానీ, నీ ఇంట్లోకి దూరి, నిన్ను పక్కకు నెట్టి, ఆ చెత్తను బయట పారేయలేడు. ఆ పని నువ్వే చేయాలి."
ఇక్కడ గురువు (లేదా ఒక పుస్తకం, లేదా ఒక తత్వశాస్త్రం) కేవలం డాక్టర్ లాంటి వాడు. ఆయన మీకు prescription రాసి ఇస్తాడు. మీరు ఆ prescription ని తీసుకెళ్లి దేవుడి పటాల దగ్గర పెట్టి పూజ చేస్తే రోగం తగ్గుతుందా? "నా దగ్గర prescription ఉంది కదా, నాకు రోగం ఎందుకు తగ్గలేదు?" అని అడగడం ఎంత మూర్ఖత్వం?
ఆ కుళ్ళిన ఆహారమే మీలో ఉన్న కామం, భయం, మరియు దురాశ. మీరు దానిని ఆనందిస్తున్నారు. దాని రుచికి మీరు బానిసలు అయ్యారు. జ్ఞానం అనేది కేవలం ఆ ఆహారం కుళ్ళిపోయిందని చూపిస్తుంది. కానీ దాన్ని విసిరేయాలనే ఉద్దేశ్యం మీలో లేదు.
మనం ఒక పెద్ద భ్రమలో బతుకుతున్నాం. "తెలిస్తే చాలు, మారిపోతాం" అని. ఇది పచ్చి అబద్ధం. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని ప్రతి ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. అది తాగేవాడికి చదవడం రాదా? వొచ్చు. అయినా ఎందుకు తాగుతాడు? ఎందుకంటే వాడికి బతకాలన్న కోరిక కంటే, ఆ క్షణికమైన మత్తు మీద ఉన్న కోరిక ఎక్కువ.
జిడ్డు కృష్ణమూర్తి గారు చూడటమే విముక్తి అంటారు. కానీ నేనింకోచ్చం ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి ఒక చేదు నిజం చెప్తా. చూడటమే విముక్తి అనేది కేవలం ముముక్షువులకు మాత్రమే వర్తిస్తుంది.
ముముక్ష అంటే ఏమిటి?
ముముక్ష అంటే "బానిసత్వం నుండి బయటపడాలనే తీవ్రమైన ఆకలి". మీ ఇంట్లో మంటలు అంటుకున్నప్పుడు, "నేను ఈ మంటల నుండి ఎలా బయటపడాలి?" అని Youtube Video లు చూస్తారా? ఎవరైనా Motivational Speaker వచ్చి మీకు క్లాస్ పీకాలా? లేదు కదా! ఎందుకంటే అక్కడ మీకు బ్రతకాలనే తీవ్రమైన తపన (ముముక్ష) ఉంది. ఆలోచించకుండా బయటకు దూకేస్తారు.
కానీ మీ కామం, మీ భయం విషయంలో మీకు ఆ తపన లేదు. మీలో ఒక అమ్మాయిని చూడగానే కలిగే ఆ ఆకర్షణ, ఆ జుగుప్స కలిగే ఉద్రేకం... మీకు లోపల ఎక్కడో అది ఇష్టం. మీ అహంకారం (Ego) ఆ చిన్న చిన్న సుఖాల కోసమే బతుకుతోంది. మీ దగ్గర జ్ఞానం (Seeing) ఉంది, కానీ విముక్తి పొందాలనే కోరిక (Mumuksha) లేదు. ముముక్ష లేని వాడికి ఉపనిషత్తులు చదివి వినిపించినా, వాడు ఆ పుస్తకం అట్టల మధ్యలో కూడా బూతు బొమ్మలు వెతుక్కుంటాడు. అదే మానవ నైజం.
ఒక అమ్మాయిని చూడగానే Uncomfortable గా ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఇది జీవశాస్త్రం (Biology) అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. జంతువులు కూడా ఒక సీజన్ లో మాత్రమే ఆకర్షితులవుతాయి. కానీ మనిషికి మాత్రం 365 రోజులు ఎందుకు ఈ ఆకలి?
ఎందుకంటే సమస్య బయట ఉన్న అమ్మాయి లేదా వస్తువు కాదు. సమస్య మీ లోపల ఉన్న "శూన్యత" (Emptiness).
మీరు లోపల పూర్తి ఖాళీగా ఉన్నారు. మీకంటూ ఒక ఉన్నతమైన లక్ష్యం లేదు. ఒక సత్యాన్వేషణ లేదు. కాబట్టి, ఆ ఖాళీని నింపడానికి మీ మనస్సు ఎప్పుడూ చవకబారు ఆకర్షణల కోసం వెతుకుతూ ఉంటుంది. అది ఒక అందమైన శరీరం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా ఒకరు మిమ్మల్ని పొగడటం కావచ్చు.
మీరు frustrate అవుతున్నది ఆ అమ్మాయిని చూసి కాదు. ఆ అమ్మాయిని చూడగానే, మీలో ఉన్న ఆ 'బిచ్చగాడు' బయటకు వస్తున్నాడు చూశారా... ఆ బిచ్చగాడిని చూసి మీరు అసహ్యించుకుంటున్నారు. "అరె, నేను గీత చదివాను కదా, నేను ఇన్ని ఫిలాసఫీలు విన్నాను కదా, అయినా నేను ఇంకా ఈ మాంసం ముద్దకి ఆకర్షితుడిని అవుతున్నానా?" అన్న Ego దెబ్బతింటోంది. మీ బాధ మీ కామం గురించి కాదు, మీ దొంగ image బద్దలైందని!
మీ చేతిలో ఉన్న చెత్తను వదిలెయ్యాలంటే, దాన్ని విసిరేయాలి. అంతే కానీ, "నేను ఈ చెత్తను ఎలా విసిరేయాలి? దయచేసి నాకు 5 టిప్స్ చెప్పండి" అని అడగడం కేవలం సమయాన్ని వృధా చేసే ఒక trick. మీ brain play చేస్తున్న trick ఇది.
"నేను మారడం లేదు, నా వృత్తులు మారడం లేదు" అని ఏడుస్తూ కూర్చుంటే గురువులు మిమ్మల్ని ఓదార్చరు.
"నువ్వు మారకపోతే ఏముంది? అలాగే ఆ lust లోనే బతుకు. ఆ కూపంలోనే కుళ్లిపో. ఎవరూ నిన్ను బలవంతంగా మార్చలేరు."
ఇది అర్థం చేసుకోవడానికి చాలా పరిణతి కావాలి. సృష్టిలో ఎవరినీ బలవంతంగా ప్రేమించమని అడగలేము. అలాగే, ముక్తిని లేదా సత్యాన్నీ బలవంతంగా ప్రేమించమని మీ మెడ మీద కత్తి పెట్టి ఎవరూ చెప్పలేరు.
మీకు స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుని మీరు మురుగు కాలువలో పడి దొర్లుతాను అంటే, ప్రకృతి మిమ్మల్ని అడ్డుకోదు. మురుగు కాలువలో దొర్లడం తప్పు అని మీకు తెలిసినా సరే, మీరు అందులోనే దొర్లుతున్నారు అంటే దానికి కారణం: మీకు ఆ మురుగు వాసనే కావాలి. మీకు ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం అనేవి కేవలం intellectual time pass. ఒకాయన weekend లో పబ్ కి వెళ్లి enjoy చేస్తే, మీరు weekend లో ఒక philosophy వీడియో చూసి enjoy చేస్తున్నారు. ఇద్దరిదీ ఒకటే మత్తు. ఇద్దరికీ వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చుకునే ఉద్దేశ్యం (Intent) లేదు. మీకు ఆ comfort zone కావాలి. మీ రోగానికి మీరు రంగులు పూసుకుంటున్నారు.
అత్యంత భయానకమైన మరియు విముక్తి కలిగించే వాస్తవం ఒకటుంది. మీరేమీ అనంత కాలం పాటు ఈ భూమి మీద ఉండరు. ఈ వాసనలు, ఈ భయాలు, ఈ నాటకాలు అన్నీ మహా అయితే ఒక 70-80 ఏళ్ళు. ఆ తర్వాత అన్నీ ముగుస్తాయి.
"కథ ఎప్పుడో ఒకప్పుడు ముగియక తప్పదు. అయితే ఇప్పుడు నీ అంతట నువ్వే (జ్ఞానంతో) దాన్ని ముగించుకో, లేదా రేపు చితి మీద మంటల్లో ఆ భయాలు, వాసనలు అన్నీ కాలిపోతాయి. నీ ఇష్టం."
ఇది చదువుతున్నప్పుడు మీకు భయం వేయాలి. వేయకపోతే మీ మెదడు మొద్దుబారిపోయింది అని అర్థం.
ఒక మనిషి తనలోని జంతు లక్షణాలను (వాసనలను, అభద్రతలను) తన బ్రతికి ఉన్నప్పుడే తన విచక్షణతో, ధైర్యంతో కాల్చి బూడిద చేస్తే వాడు 'జీవన్ముక్తుడు'. అలా కాకుండా, రోజూ అదే బురదలో దొర్లుతూ, "రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను" అని సాకులు చెబుతూ పోతే, చివరికి ఆ కాటికాపరి ఆ పని చేస్తాడు. అప్పటికి మీరు ఒక ఓడిపోయిన జీవిగా, ఏడుస్తూ, భయపడుతూ ఈ లోకాన్ని వదిలివెళ్తారు.
ఇప్పుడు చెప్పండి, సమస్య ఎక్కడ ఉంది? సమస్య బయట తిరుగుతున్న ఆకర్షణల్లో ఉందా? సమస్య సమాజంలో ఉందా? లేదు. సమస్య మీ ఉద్దేశ్యంలో ఉంది. మీ నిజాయితీ లేమిలో ఉంది.
మీరు ఎప్పటినుండో దాచిపెట్టుకున్న ఆ కుళ్ళిన చెత్తను బయట పారేయడానికి మీకు ఏ గురువు అవసరం లేదు, ఏ Youtube Video అవసరం లేదు, ఏ Motivational book అవసరం లేదు. కావాల్సిందల్లా ఒక్కటే: "ఇక చాలు, ఈ బానిసత్వంలో నేను బతకలేను" అన్న ఒక ప్రచండమైన నిర్ణయం. ఒక రాజీపడని తెగింపు.
ఈ blog చదివిన తర్వాత కూడా మీరు ఇంకో video కోసమో, ఇంకో article కోసమో వెతుకుతున్నారంటే, మీరు ఇంకో మత్తు బిళ్ళ కోసం వెతుకుతున్నట్టే లెక్క. నిర్ణయం మీదే!
-PRATIKULA VEDAM
.jpg)
Comments
Post a Comment