Arranged Marriage ఒక అశ్లీల సంత: The Dark Psychology of Relationships
Arranged Marriage: ఇదొక షరతులతో కూడిన అశ్లీల సంత
సహజంగా జరిగిపోవాల్సిన దాన్ని అసాధ్యంగా మార్చేది ఎవరు? దాని పేరే 'Ego' (అహంకారం). Ego అంటే ఇంకేదో కాదు, నీ belief system. నీ బుర్రలో నువ్వు సృష్టించుకున్న ఒక అబద్ధపు ప్రపంచం, ఒక fictitious self. Oxygen, Nitrogen గాలిలో ఎలా కలిసిపోతాయో, ఆడ-మగ అలా కలిసిపోవాలి. కానీ నీ అహంకారం అడ్డు వస్తుంది. నీకు అమ్మాయి కావాలి, కానీ ఎలా కావాలి?
- నా కులం అయి ఉండాలి.
- నా స్టేటస్ కి తగ్గట్టు ఉండాలి.
- తెల్లగా, గ్లామరస్ గా ఉండాలి.
- మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉండే అత్యంత దారుణమైన కండిషన్: 'First-hand' అయి ఉండాలి (అంటే ఇంతకు ముందు ఎవరితోనూ రిలేషన్ ఉండకూడదు).
ఆస్తి, ఆధిపత్యం మరియు 'First-hand' కండిషన్ వెనుక ఉన్న చరిత్ర
అసలు ఈ మానసిక జబ్బు ఎక్కడ మొదలైందో చరిత్రలోకి వెళ్లి చూద్దాం. ఆదిమానవులుగా, వేటగాళ్లుగా (hunter-gatherer societies) బతికినప్పుడు మనిషికి ఆస్తి లేదు, కులం లేదు. సహజంగానే ఆడ, మగ కలిసేవాళ్లు. కానీ ఎప్పుడైతే మనిషి వ్యవసాయం (Agricultural Revolution) మొదలుపెట్టి 'పొలం' అనే ఆస్తిని కూడబెట్టాడో, ఆ ఆస్తి తన వారసుడికే దక్కాలి అన్న స్వార్థం మొదలైంది. పుట్టబోయే బిడ్డ 'తనకే' పుట్టాడని నిర్ధారించుకోవడానికి, చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆడదాని చుట్టూ 'పవిత్రత' అనే కంచె వేశారు. పైన చెప్పుకున్న దరిద్రపు 'First-hand' కండిషన్ పుట్టింది ఈ ఆస్తి ఆధిపత్యం నుంచే!
నేను ఏమీ చేయకపోయినా, ఆమె నా కాళ్ల దగ్గరకు వచ్చి "ఓ ప్రాణనాథా, నిన్నే నా పతిగా భావించాను" అని పడిపోవాలి. అమ్మకి నచ్చాలి, వంట బాగా చేయాలి, కానీ బయటకి వెళితే మోడల్ లా కనపడాలి. ఇన్ని దరిద్రపు కండిషన్లు పెట్టుకుని, "నాకు ఎవరూ దొరకట్లేదు" అని ఏడిస్తే ఎవరు జాలి పడతారు? ప్రకృతి ఇన్ని షరతులు పెట్టదు. నువ్వు భోజనం చేయడానికి కూర్చుని, "మా అమ్మ చేసే అన్నం సరిగ్గా 5823 Angstroms ఉన్న తెలుపు రంగులోనే ఉండాలి, లేకపోతే తినను" అని కండిషన్ పెడితే ఏమవుతావు? ఆకలితో మాడి చస్తావు. ఇప్పుడు నీ యవ్వనంలో నువ్వు చస్తున్నది కూడా అందుకే.
మన 'Arranged Marriage' సిస్టమ్ ఒక పచ్చి అశ్లీలత (vulgarity). పెళ్లిచూపుల పేరుతో ఆడవాళ్ళను ఒక సంతలో పశువులను చూసినట్టు చూస్తారు. పళ్లు ఎలా ఉన్నాయి, రంగు ఎలా ఉంది, జుట్టు ఎంత పొడవు ఉంది? ఒక మనిషిని కొలతలు వేసి కొనుక్కునే ఈ సంస్కృతిలో ప్రేమ ఎక్కడుంది? నువ్వు మనుషులను వెతకట్లేదు, నీ షరతులకు సరిపోయే ఒక బొమ్మను వెతుకుతున్నావు. అందుకే నీ జీవితం ఇంత artificial గా తగలబడింది.
సమాజం మెచ్చే "మంచోడు" ఒక సైకలాజికల్ పేషెంట్
మన సమాజంలో, ముఖ్యంగా ఈ యూట్యూబ్ మోటివేషనల్ స్పీకర్లు, బాబాలు ఒక చెత్త ఐడియాలజీని నూరిపోశారు. "ఆ అబ్బాయి చాలా మంచోడు, ఏ అమ్మాయితోనూ మాట్లాడడు. మహా పతివ్రతుడు." లేదా "ఆ అమ్మాయి చాలా పద్ధతి గలది, మగవాళ్ల వంకే చూడదు."
Let me be brutally honest with you: వాళ్ళు మంచివాళ్ళు కారు, వాళ్ళు mental patients. వాళ్ళు psychologically sick.
ఈ ప్రపంచంలో సగం జనాభా ఆడవాళ్ళు. ఆ సగం జనాభాతో నువ్వు కమ్యూనికేట్ చేయలేకపోతున్నావు, వాళ్ళను చూస్తే నీకు భయం, వణుకు, లేదా ఎక్కడ లేని excitement వస్తోంది అంటే... నీ బుర్రలో ఏదో పెద్ద డ్యామేజ్ జరిగినట్టే కదా? దాన్ని క్యారెక్టర్ అని, సంస్కృతి అని ఎందుకు గ్లోరిఫై చేస్తున్నారు?
Victorian Morality మరియు అణచివేయబడిన కామం
ఒకప్పుడు మన దేశంలో ఖజురహో (Khajuraho) శిల్పాలు, వాత్సాయనుడి కామసూత్ర రాసిన కాలంలో, శృంగారాన్ని జీవితంలో ఒక సహజమైన భాగంగా (ధర్మ, అర్థ, కామ, మోక్ష) చూశారు. వాళ్ళలో దాపరికాలు లేవు. కానీ ఎప్పుడైతే వలసవాద బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పనికిమాలిన 'Victorian Morality' ని మన నెత్తిన రుద్దారో, సెక్స్ అనేది ఒక పాపంగా, బూతుగా మారిపోయింది.
ఆడ-మగ మధ్య ఆ సహజమైన గోడలు లేని వాతావరణాన్ని నాశనం చేసి, వాళ్ల మధ్య భయంకరమైన physical and mental పరదాలు (curtains) కప్పేసి, ఒకరి మీద ఒకరికి పిచ్చి fantasies క్రియేట్ చేశారు. వాళ్ళు ఒక మనిషిలా కాకుండా, ఏదో గ్రహాంతరవాసుల్లా ఫీల్ అయ్యేలా చేశారు. ఒక మగవాడు ఒక ఆడదానితో మాట్లాడటం లేదంటే వాడు బ్రహ్మచారి కాదు, వాడు ఒక పిరికివాడు లేదా విపరీతమైన కోరికలను లోపల అణచిపెట్టుకున్న ఒక ప్రమాదకరమైన మనిషి.
వీడికే కనుక పెళ్లి చేస్తే, ఆ వచ్చే అమాయకురాలి జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకంటే, అణచివేయబడిన కామం ఎప్పుడూ ఒక భయంకరమైన హింసగా మారుతుంది.
ప్రతి బంధాన్ని సెక్స్ కోణంలో చూసే రోగం (Over-Sexualization)
అసలు సమస్య ఇక్కడే ఉంది. ఒక అబ్బాయి, అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే... నీకెందుకు కడుపుమంట? వాళ్ళు "ఒక Couple" లేదా "వాళ్ళు సెక్స్ కోసం తిరుగుతున్నారు" అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇద్దరు మనుషులు నడుస్తున్నారు అని ఎందుకు చూడలేకపోతున్నావు?
మన కల్చర్ లో ప్రతి రిలేషన్ షిప్ ని విపరీతంగా sexualize చేసేశారు. ఎప్పుడైతే నువ్వు "నా జీవితంలోకి ఒక అమ్మాయి రావాలి" అని కోరుకుంటావో, నువ్వు ఒక మనిషిని కోరుకోవట్లేదు, నువ్వు ఒక 'Sexual Object' ని కోరుకుంటున్నావు. అందుకే నీకు దొరకట్లేదు.
పురాణాల్లో యయాతి మహారాజు కథ తెలుసా? తన కామాన్ని తీర్చుకోవడానికి తన సొంత కొడుకు యవ్వనాన్నే అప్పుగా తీసుకున్నాడు. వెయ్యేళ్లు భోగాలు అనుభవించినా వాడి దాహం తీరలేదు. ఎందుకంటే వాడు కోరుకున్నది ఇంకో మనిషిని కాదు, కేవలం ఒక వస్తువుని. ఇవాళ నువ్వు చేస్తున్నది కూడా అదే. ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే, ఆమె కేవలం నీ శారీరక కోరికలు తీర్చే యంత్రం కాదు. She is a multi-dimensional human being.
- ఆమెకు రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు ఆరాధించే నాయకుడి మీద ఆమె ఉమ్మేయవొచ్చు. అప్పుడు నువ్వు తట్టుకోగలవా?
- ఆమెకు ఫుడ్ హ్యాబిట్స్ వేరుగా ఉండొచ్చు. నువ్వు నాన్-వెజ్ లేకుండా బతకలేవు, ఆమె "నేను పాలు కూడా తాగను, జంతు హింస నాకు నచ్చదు" అనొచ్చు. అప్పుడు ఏం చేస్తావు?
- నువ్వు ఒక మతాన్ని విపరీతంగా ద్వేషిస్తూ ఉండొచ్చు, ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ ఆ మతం వాళ్లే అయి ఉండొచ్చు. అప్పుడు ఆమెను భరించగలవా?
నువ్వు ఇవేమీ ఆలోచించట్లేదు. నువ్వు కేవలం ఒకే ఒక center నుంచి ఆలోచిస్తున్నావు: Sexuality. అందుకే ఎవరైనా దొరికినా, వాళ్లతో నువ్వు ఎక్కువ కాలం బతకలేవు. చుట్టుపక్కల Couples ని చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావు అంటే, వాళ్ళ మధ్య ఉన్న మానసిక బంధాన్ని చూసి కాదు, వాళ్ళ శరీరాలను చూసి. This is the bitter, unspoken truth.
బీహార్ గైనకాలజిస్ట్ చెప్పిన 16 ఏళ్ల గర్భవతి స్టోరీ (Legalized Abuse)
మనం పాశ్చాత్య దేశాలను (Western societies) చూసి తెగ విమర్శిస్తుంటాం. వాళ్ళు పబ్లిక్ గా కిస్ చేసుకుంటారు, వాళ్ళ కల్చర్ పాడైపోయింది అని మనకు మనం గొప్పలు చెప్పుకుంటాం. కానీ నేను అడుగుతున్నాను, నిజంగా ఏ సమాజం ఎక్కువ sexualized? వాళ్ళదా? మనదా? వాళ్ళు ఓపెన్ గా ఉంటారు. కానీ మనం ముసుగులో గుద్దులాట ఆడుతూ, మనుషులను objects లాగా చూసేది మనం.
దీనికి ఒక భయంకరమైన ఉదాహరణ చెప్తాను. బీహార్ లోని ఒక గైనకాలజిస్ట్ షేర్ చేసిన ఒక నిజమైన సంఘటన ఇది. ప్రతిరోజూ ఎంతోమంది పెళ్లైన అమ్మాయిలు ఆమె దగ్గరకు వస్తుంటారు డెలివరీ కోసం, లేదా అబార్షన్ కోసం. ఆ వచ్చేవాళ్ళలో చాలా మంది మైనర్లు (16-17 ఏళ్ల అమ్మాయిలు). వాళ్లకు చట్టబద్ధంగా MLC (Medico-Legal Case) ఫామ్ రాయాలి.
ఆ అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకు పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ అత్తనో, మొగుడినో అడిగి చెప్తారు. అంత పసి పిల్లలు, అంత అమాయకులు. పెళ్లైన మొదటి ఏడాదే గర్భవతి అవుతారు, లేదా మొదటి అబార్షన్ అయిన వెంటనే మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతారు.
ఆడవాళ్ళను పరదాల్లో పెట్టి, మగవాళ్ళను వాళ్ళకు దూరం చేసి మనం సాధించింది ఏంటి? ఆ 16 ఏళ్ల పిల్లని పెళ్లి చేసుకున్న ఆ మగవాడు ఉన్నాడు చూశారా... వాడు 25 లేదా 30 ఏళ్ల వరకు "అమ్మాయి దొరకట్లేదు" అని రగిలిపోయిన కుర్రాడే. ఎప్పుడైతే వాడి చేతికి ఒక చట్టబద్ధమైన ఆడపిల్ల (భార్య) దొరికిందో, లోపల పేరుకుపోయిన ఆ కామన్నంతా (accumulated lust) ఆమె మీద చూపించి, ఒక పసిపిల్లను యంత్రంలాగా ప్రెగ్నెంట్ చేస్తాడు.
దీన్ని సంసారం అంటారా? దీన్ని పెళ్లి అంటారా? ఒరేయ్ నీచుడా, ఇది పక్కా 'రేప్'. ఇది legal గా సమాజం ఆమోదించిన రేప్. ఆడ-మగ సంబంధాన్ని ఒక సహజమైన స్నేహంగా చూడకుండా, దాన్ని దెయ్యంలాగా, దేవుడిలాగా, లేదా ఒక బూతులాగా మార్చేసిన ఈ సమాజం చేస్తున్న హత్యలు ఇవి.
విభజన (Division): ఈ సామాజిక హింసకు అసలు మూలం
ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? The core philosophy of this entire rot is "Division" (విభజన). ఎప్పుడైతే మనిషి తన చుట్టూ గీతలు గీసుకుంటాడో, అప్పుడే హింస మొదలవుతుంది. మహాభారతం కురుక్షేత్ర యుద్ధమైనా, చరిత్రలో జరిగిన మారణహోమాలైనా ఈ 'గీతలు' గీసుకోవడం వల్లే పుట్టాయి.
- నేను మగాడిని, ఆమె ఆడది అనే గీత గీసినప్పుడు, ఆమె నీకు ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లా కనిపిస్తుంది.
- నేను బ్రాహ్మణుడిని/రెడ్డిని/కమ్మని, వాడు తక్కువ కులం వాడు అనే గీత గీసినప్పుడు, వాడు నీకు బానిసలా కనిపిస్తాడు. (ఏకలవ్యుడి బొటనవేలు కోసింది ఈ గీత వల్లే).
- నేను హిందువుని, వాడు ముస్లిం అనుకున్నప్పుడు అల్లర్లు జరుగుతాయి.
- మేము స్వచ్ఛమైన ఆర్యులం, వాళ్ళు యూదులు (Jews) అని హిట్లర్ గీత గీసినప్పుడు Holocaust జరిగింది, లక్షల మంది గ్యాస్ ఛాంబర్లలో చనిపోయారు.
- నేను మనిషిని, అది జంతువు అని నువ్వు అనుకున్నప్పుడు, ఆ జీవి నీకు నీ ప్లేట్ లో తినే మాంసంలా (food) కనిపిస్తుంది.
ఎవడైతే నీకంటే 'వేరు' అని నువ్వు నమ్ముతావో, వాడిని నువ్వు అణచివేస్తావు లేదా నీ స్వార్థం కోసం వాడుకుంటావు. పెళ్లి పేరుతో భార్యను వాడుకుంటావు, లేదా భర్తను ఏటీఎమ్ (ATM) మెషిన్ లా వాడుకుంటావు.
చిన్న పిల్లల్ని చూడండి. వాళ్లకు కోడి పిల్లకి, మనిషికి తేడా తెలియదు. ఆ కోడి పిల్లతో ఆడుకుంటారు. కానీ సమాజం (తల్లిదండ్రులు) వాళ్ళకు నేర్పిస్తుంది, "అది కోడి, ఇది మనం తినే ఆహారం" అని. ఆ తర్వాత వాడే దాన్ని చంపి తింటాడు. ఆడ-మగ సంబంధం కూడా అంతే. పుట్టినప్పుడు ఇద్దరూ మనుషులే. కానీ సమాజం నీ బ్రెయిన్ లో విషం నింపి, ఆమెని ఒక 'వస్తువు' గా మార్చేసింది.
ఈ Insecurity నుండి బయటపడటం ఎలా? (The Solution)
మరి దీనికి పరిష్కారం ఏంటి? డిప్రెషన్ లోకి వెళ్లిపోవడమా? కాదు.
Wake up and destroy your ego. ఆ కల్పితమైన, ఫేక్ అయిన కండిషన్స్ ని పక్కన పెట్టు. మనిషిని మనిషిగా చూడటం మొదలుపెట్టు. ఒక అమ్మాయిని చూసినప్పుడు, నీ కామం కళ్ళతో కాకుండా, "నా లాంటి ఇంకో మనిషి" అన్న దృష్టితో చూడు. వాళ్ళను ఆకాశానికెత్తొద్దు, అలాగని పాతాళానికి తొక్కొద్దు.
ఎప్పుడైతే నువ్వు "నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి" లేదా "నాకు సెక్స్ కావాలి" అనే బిచ్చగాడి ఆలోచనల నుంచి బయటకు వచ్చి, "నేను ఒక మంచి మనిషిని కలవాలి" అని అనుకుంటావో... అప్పుడు చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో. సహజంగానే కొత్త మనుషులు వస్తారు. అందులో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ముసలివాళ్లు ఉంటారు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఉంటారు.
లైఫ్ అనేది ఒక స్వేచ్ఛా ప్రవాహం. దానికి కండిషన్లు పెట్టి బంధించకు. "నా జీవితంలో చందమామ లాంటి అమ్మాయి వస్తేనే, నా కోసం శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తేనే నా బతుకుకి అర్థం" లాంటి చెత్త సినిమా డైలాగులు నమ్మడం మానేయ్. ఉన్న వాళ్లు ఉంటారు, వెళిపోవాలనుక్కోళ్లు వెళ్ళిపోతారు.
Couples ని చూసి ఏడవడం మానేసి, నీ లోపల ఉన్న ఇన్సెక్యూరిటీని, నీ రోగగ్రస్తమైన మనస్తత్వాన్ని అర్థం చేసుకో. Just Be A Human. నీ గుడ్డి మూఢనమ్మకాల నుండి బైటికి రా. అప్పుడే నువ్వు నిజంగా జీవించినట్టు. లేకపోతే, బ్రహ్మచర్యం ముసుగులో బతుకుతున్న ఒక పచ్చి కామాంధుడిగానే మిగిలిపోతావు.
.jpg)
.jpg)
Really great words...sir
ReplyDeleteAbsolutely True 💯%
ReplyDeleteWhat you said is right sir but our society is running under ego,cast,color ,money
ReplyDeleteSuper message
ReplyDelete