The Beauty Trap: స్త్రీలు అసలైన Power తేలిక మోసపోతున్నారా?
.jpg)
సమాజం మన కళ్ళకు గంతలు కట్టి, ఒక భయంకరమైన అబద్ధాన్ని 'అందం' అనే packaging లో అమ్ముతోంది. ముఖ్యంగా స్త్రీలకు, వారి అస్తిత్వాన్ని కేవలం వారి శరీర పరిమాణాలకు కుదించి, అదే వారి 'Power' అనే ఒక కృత్రిమమైన భ్రమను సృష్టిస్తోంది. ఈ రోజు మనం ఈ భ్రమను, సమాజం కప్పిన ఈ ముసుగును, ఎలాంటి మొహమాటం లేకుండా, ఒక ruthless analytical దృక్పథంతో ఛేదిద్దాం. స్త్రీలు తమను తాము ఎలా మోసం చేసుకుంటున్నారో, ఈ 'Beauty Myth' వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం ఏమిటో step-by-step లాజికల్ గా డీకోడ్ చేద్దాం.
ఒక 16, 25 లేదా 30 ఏళ్ల వయసులో ఉన్న యువతికి సమాజం నుండి, ముఖ్యంగా పురుషుల నుండి విపరీతమైన attention దొరుకుతుంది. రోడ్డు మీద నడుస్తుంటే చూపులు, Social mediaలో లైకులు, కొన్నిసార్లు కేవలం వారి శారీరక ఆకర్షణ ఆధారంగా అవకాశాలు, బహుమతులు లేదా డబ్బు కూడా సులభంగా లభిస్తాయి.
ఇక్కడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. ఆ యువతికి ఏమనిపిస్తుందంటే, "ఇదే నా అసలైన బలం."
కానీ, కొంచెం లోతుగా ఆలోచించండి. పురుషులు మీ దేహాన్ని చూసి తేప కార్చుకుంటున్నారు అంటే, అది మీ శక్తి కాదు, అది మీ బలహీనతకు పునాది. వారు మీ మేధస్సుకు, మీ వ్యక్తిత్వానికి లేదా మీ నైపుణ్యానికి తలవంచడం లేదు. వారు కేవలం మీ మాంసపు ముద్దకు, మీ యవ్వనానికి బానిసలయ్యారు. ఆ attention మీ సొంతం కాదు, అది కేవలం మీ వయసుకు, మీ శరీరానికి మాత్రమే పరిమితం. కాలం గడిచేకొద్దీ కరిగిపోయే ఒక 'Depreciating Asset' మీద మీ మొత్తం జీవిత పునాదిని నిర్మించుకోవడం ఎంతటి అజ్ఞానం?
ఒక యువతి ఆలోచనా విధానం ఎలా మారుతుందో విశ్లేషిద్దాం. "నాకు అందమైన దేహం ఉంది, ఆకర్షణీయమైన ముఖం ఉంది. దీని వల్లే నాకు అన్నీ దొరుకుతున్నాయి. ఎంతో ఉన్నత విద్యావంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే పురుషులు సైతం నా ముందు మోకరిల్లుతున్నారు. నా చేయి పట్టుకోవడానికి క్యూలో నిలబడుతున్నారు. అలాంటప్పుడు, నేను కష్టపడి చదువుకోవడం ఎందుకు? నేను పెద్ద ఉద్యోగం సాధించడం ఎందుకు? నా రూపం చూసి ఇంతమంది నా వెనుక పడుతున్నప్పుడు, నేను ఎందుకు రక్తం చిందించి శ్రమించాలి?"
ఇది చాలా సహజంగా పుట్టే ఒక ప్రమాదకరమైన ఆలోచన. ఈ రకమైన cognitive dissonance స్త్రీలను తమలోని ఇతర సామర్థ్యాలను, నైపుణ్యాలను, మేధస్సును అభివృద్ధి చేసుకోకుండా అడ్డుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, మీ శారీరక సౌందర్యం మీ ఎదుగుదలకు పడిన సంకెళ్లు. పురుషుల కామంతో నిండిన చూపులు మీ ముందు వాలినప్పుడు, మీరు పొందుతున్న ఆ తాత్కాలిక ego boost, జీవితకాలం పాటు మిమ్మల్ని ఆధారపడే వారిగా dependents గా మార్చేస్తోంది. ఆ అందం అనేది కొన్నాళ్లకు ఆవిరైపోతుంది, కానీ మీరు సంపాదించిన జ్ఞానం, మీ క్యారెక్టర్, మీ స్కిల్స్, మీ విజయాలు జీవితాంతం మీతోనే ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న Cosmetics మరియు Make-up మార్కెట్ లో కొనుగోలుదారులు ఎవరు? 80 నుండి 90 శాతం కేవలం స్త్రీలే. అంటే, ఈ వ్యాపారం మొత్తం స్త్రీల అభద్రతా భావం (insecurity) మీదే నడుస్తోంది.
ఇప్పుడు ప్రపంచంలో అధికారం ఎవరి చేతిలో ఉందో చూద్దాం.
ప్రపంచ సంపదలో దాదాపు 95% పురుషుల చేతిలో ఉంది. కేవలం 2-4% మాత్రమే స్త్రీల చేతిలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్లు, శాసనసభల్లో 90% పురుషులే ఉన్నారు. స్త్రీల ప్రాతినిధ్యం మహా అయితే 5-10%.
Corporate ప్రపంచంలో, టాప్ మేనేజ్మెంట్ CEO, COO, CTO levels లో 90% పురుషులే.
దీని అర్థం ఏమిటి? ప్రపంచాన్ని శాసించే అధికారాలు, విధానాలు, సంపద మొత్తం పురుషులు లాగేసుకున్నారు. కానీ ముఖానికి రంగులు వేసుకునే వ్యాపారంలో మాత్రం 90% స్త్రీలు మునిగిపోయారు. మీకు ఈ రెండిటికీ మధ్య ఉన్న సంబంధం (correlation) కనిపించడం లేదా?
మీరు అద్దం ముందు గంటల తరబడి కూర్చుని మీ చర్మాన్ని మెరుగుపరుచుకుంటున్న సమయంలో, వాళ్ళు ప్రపంచ పటాన్ని గీస్తున్నారు. మీరు మీ బాహ్య సౌందర్యం అనే ఒక చిన్న గుంతలో కొట్టుమిట్టాడుతుంటే, వాళ్ళు ప్రపంచమనే సముద్రాన్ని పాలిస్తున్నారు. బాహ్య సౌందర్యం మీద ఇంత మక్కువ చూపించడం అనేది స్త్రీల మెడకు తగిలించిన అతి పెద్ద ఉచ్చు. ఈ దేహ సౌందర్యం అనే బంధనాన్ని తెంచుకోనంత వరకు, స్త్రీ ఈ ప్రపంచంలో తన అస్తిత్వాన్ని, తన నిజమైన ఉనికిని, తన అసలైన బలాన్ని ఎప్పటికీ స్థాపించలేరు.
చాలామంది స్త్రీలు కోరుకునే ఒక ఫాంటసీ దృశ్యాన్ని విశ్లేషిద్దాం. ఒక ఖరీదైన కారు. ఆ కారు నడుపుతున్నది ఒక పురుషుడు. పక్క సీట్లో (passenger seat) ఒక 'అందమైన' స్త్రీ కూర్చుని ఉంటుంది. ఆమె ఏం చేస్తుంటుంది? ఆ డ్రైవర్ సీటు పక్కన ఉన్న sunshield ని కిందకు దించి, అందులో ఉన్న చిన్న అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ, వెంట్రుకలు సరిచేసుకుంటూ, పెదాలకు లిప్ స్టిక్ రుద్దుకుంటూ ఉంటుంది.
ఇక్కడ మనం అడగాల్సిన అసలైన ప్రశ్నలు:
ఆ కారు నడుపుతున్నది ఎవరు?
ఆ కారు ఎవరి పేరు మీద ఉంది?
ఆ కారు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయిస్తున్నది ఎవరు?
సమాధానం: పురుషుడు.
ఆ స్త్రీ కేవలం ఆ కారులో ఒక అందమైన వస్తువు (ornament). ఆమె పాత్ర ఆ అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడం మాత్రమే. జీవితంలో కూడా ఇదే జరుగుతోంది. మీరు కేవలం మీ అందాన్ని మాత్రమే నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే, మీ జీవితాన్ని ఇంకెవరో నడుపుతారు. మీరు ఎల్లప్పుడూ పక్క సీట్లోనే ఉంటారు. కారు నడిపేవాడి దయాదాక్షిణ్యాల మీదే మీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది.
ఇతరుల కారులో పక్కన కూర్చుని లిప్ స్టిక్ వేసుకోవడం 'Power' కాదు, అది బానిసత్వం. అది గౌరవం కాదు. అందులో ఎలాంటి అందం లేదు.
ఈ విశ్లేషణ వినగానే, సమాజంలో ఉన్న చాలా మంది (ముఖ్యంగా తమను తాము Liberal అనుకునే స్త్రీలు) వెంటనే defense mode లోకి వెళ్ళిపోతారు. వారి వాదనలు ఎలా ఉంటాయంటే:
"మా ఇష్టం వచ్చినట్లు మేము ఉంటాం, మా గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది?"
"మీరు మగాళ్లు, మీకు ఆడవాళ్ళ సమస్యలు ఎలా తెలుస్తాయి?
"నాకు నచ్చినట్లు తిరగడమే నా స్వేచ్ఛ."
ఇది చాలా అసంబద్ధమైన logic లేని వాదన. మనం ఒక తప్పును point out చేస్తున్నప్పుడు, ఆ point లో ఉన్న సత్యాన్ని చూడాలి కానీ, చెప్పేవాడి gender ని కాదు.
ఇక స్వేచ్ఛ (Liberation) గురించి మాట్లాడుకుందాం. స్వేచ్ఛ అంటే గుడ్డిగా దొరికిన దారల్లా తిరగడం కాదు. మనసుకు వచ్చినట్లు ప్రవర్తించడాన్ని, ప్రతి ఉద్రేకానికీ తలొగ్గడాన్ని Liberation అనరు. జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోకుండా, సరైన పుస్తకాలు చదవకుండా, సరైన గురువుల వద్దకు వెళ్లకుండా, "నేను Modern Woman ని, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను" అని అనడం మూర్ఖత్వం. అది స్వేచ్ఛ కాదు, అది అజ్ఞానం.
అలాగైతే అసలైన అందం, అసలైన బలం అంటే ఏమిటి?
1. అధికారం మరియు దిశానిర్దేశం: నిజమైన అందం అంటే కారు మీ సొంతమై ఉండాలి. Steering wheel మీ చేతిలో ఉండాలి. ఆ కారు ఎక్కడికి వెళ్ళాలి అనే గమ్యాన్ని మీరే నిర్ణయించాలి. ఆ గమ్యం సరైనదో కాదో తెలుసుకునే విచక్షణ, బోధ (wisdom) మీ దగ్గర ఉండాలి. ఇదీ సౌందర్యం అంటే!
2. మేధోపరమైన ఆధిపత్యం: జ్ఞానం మీ అసలైన బలం. మీ నైపుణ్యాలు (skills) మీ ఆయుధాలు. మీరు ఈ ప్రపంచాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారు, మీ అనుభవం ఏమిటి, సమస్యల పట్ల మీ అవగాహన ఏమిటి? ఇవి మీ అసలైన అందం. ఇవి కాలంతో పాటు పెరుగుతాయి తప్ప తరిగిపోవు.
3. నిజమైన శారీరక దారుఢ్యం: ఒకవేళ మీరు శరీరానికే అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనుకుంటే, శారీరక అందం అంటే ముఖానికి వేసే రంగులు కాదు, సైజ్ జీరో ఫిగర్ కాదు. శారీరక అందం అంటే Fitness. మీ శరీరాన్ని బలంగా ఉంచుకోవడం. మీకు పరిగెత్తడం రావాలి. హై హీల్స్ వేసుకుని పరిగెడితే కాలు బెణికింది అని ఏడ్చేంత బలహీనంగా ఉండకూడదు.
మీ చేతి పిడికిలిలో ఎంత బలం ఉండాలంటే, ఒకవేళ అవసరమైతే, ఎదురుగా ఉన్న ఏ బలమైన పురుషుడి ముఖం మీదైనా గుద్దితే, వాడి పళ్లు రాలిపోయి దవడ పగిలిపోయేంత బలం మీ చేతుల్లో ఉండాలి. అది అసలైన అందం! అది అసలైన Fitness!
Social Media create చేసిన భ్రమల ప్రపంచం నుండి బయటకు రండి. ఎగతాళిగా చూసే పురుషుల చూపులను, లైకులను ఆహ్వానించడం మానేయండి. మీ దేహం మీ ఐడెంటిటీ కాదు. మీ మెదడుకు పదును పెట్టండి. జీవితం అనే డ్రైవింగ్ సీట్లో కూర్చోండి. అప్పుడే ఈ ప్రపంచం మీకు నిజంగా తలవంచుతుంది. నిజాన్ని నిర్భయంగా, కఠినంగా స్వీకరించగలిగే ధైర్యం ఉంటేనే ఈ మార్పు సాధ్యం. లేదంటే ఆ అద్దం ముందు కూర్చుని, కరిగిపోతున్న యవ్వనానికి రంగులు పూసుకుంటూ జీవితాంతం ప్యాసింజర్ సీట్ లోనే మిగిలిపోతారు. చాయిస్ మీదే.
-PRATIKULA VEDAM
Comments
Post a Comment